August 31, 2020

హిందూటీవి  ప్రపంచ దేశాల సంస్కృతులలోకెల్ల మహోన్నతమైనదిగా, సాంప్రదాయాలన్నింటిలో ఆది గురువుగా యావత్ సమాజానికే దశా దిశ చూపిన భారతీయ సనాతన ధర్మ సంస్కృతుల రక్షణలో భాగంగా, సనాతన ధర్మ సిధ్ధాంతాలను విశ్వం నలుదిశలా వ్యాప్తి చేయాలన్న సత్సంకల్పంతో ప్రారంభించబడినదే ” హిందూ టీవి ” .  సమోన్నత ఆశయం, దేశ భక్తి, ధర్మనిష్ఠ కలిగిన ఎందరో మహాత్ముల సూచనలు, సలహాలతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభించటం జరిగింది.

మా ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలచిన సహృదయులైన హిందూ బంధువులందరికి మా హృదయ పూర్వక నమస్సులు తెలుపుకుంటూ మీ అందరి ఆధరాభిమానాలకు ఎల్లప్పుడు మీకు ఋణ పడి ఉంటామని తెలుపుతూ ముందుకు సాగుతున్నాం.

కార్యాచరణ :  భారతీయ సనాతన ధర్మ సంస్కృతుల రక్షణలో భాగంగా మన ధర్మ సిద్ధాంతాలను, వేధాలను, ఉపనిషత్తుల సారాన్ని, మహాత్ముల సందేశాలను, దైవిక విశయాలను, ధార్మిక సుగునాలను భారతమాత మెడలో మణిహారంగా వెలుగొందే భారతీయ కళలను, దేశ చరిత్రను, దేశ భక్తుల గాధలను అన్నింటికి మించి దేశ ధర్మ సంస్కృతుల విలువలు చాటే ప్రతి అంశాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో  అందించటమే మా లక్ష్యంగా  వీడియోలను రూపొందించి ధారావాహికలుగా అందచేయటతో పాటు యుఅవతను దేశ సేవ వైపుగా నడిపించే సమోన్నత లక్ష్యంతో ముందుకుసాగుతున్నాము.

హైందవ సంస్కృతి మాస పత్రిక : హిందూ టీవి అరంభానికి పూర్వము 2011వ సంవత్సరములో కరీంనగర్ కేంద్రముగా ప్రస్థుత హిందూ టీవి చైర్మన్ సీనియర్ పాత్రికేయులు శ్రీ సంకేపల్లి భరత్ కుమార్ శర్మ గారి నేతృత్వములో హైందవ సంస్కృతి పేరిట ఒక మాస పత్రిక ప్రారంభించి దాని ద్వార  భారతీయ సనాతన ధర్మ సంస్కృతుల రక్షణ అనే మహోజ్వల సంకల్పానికి తొలి అడుగు వేసాము.  హైందవ సంస్కృతి మాస పత్రిక జనబహుల్యములోకి తీసుకొని రావటానికి ఎంతో కర్చుతో కూడుకున్నది ఐనను  ప్రతి నెల ఒక ప్రసవ వేధనలా దానిని ప్రచురించి పాఠక లోకానికి అందించటం జరిగింది అలా జరుగుతున్న ప్రయాణంలో అనేక ఒడి దుడుకులు ఐనా ఏలాంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రతిమాసం పాఠకుల అభిరుచిని అనుసరించి  సరికొత్త శీర్షికలతో సుమారు 8 దేశాలలో ఉన్న ధర్మపరాయణులైన పాఠకులకు ఈ నాటికి అందిస్తూనే ఉన్నాం ( హైందవ సంస్కృతి మాస పత్రిక పాత సంచికలు మన పాఠకులకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి).

చివరగా : మా ముందున్నది ఒకటే లక్ష్యం   భారతీయ సనాతన ధర్మ సంస్కృతుల రక్షణ, దేశ సేవకు యువతను సమాయత్తం చేయటం ఇదే ప్రధానంగా “NATION FIRST” అనే నినాధంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకు దృష్య శ్రవణ ప్రసార మాధ్యమంగా వస్తున్న హిందూ టీవి ని ఆధరిస్తారని, ఆశీర్వధిస్తారని అశిస్తూ ….

యాజమాన్యం

“NATION FIRST” Networks Pvt Ltd

Hyderabad.

PH : 9000790904 / 7799975556.