March 15, 2021
  • Home
  • ఆలయాలు
  • కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న
ఆలయాలు

కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న

తెలంగాణా రాష్ట్రంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కొండగట్టు ఒకటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం జిల్లాల విభజనలో జగిత్యాల కిందికి వస్తుంది. మల్యాల మండలంలో ఉన్న ఈ కొండగట్టులో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ పుణ్యక్షేత్రంకి వచ్చే భక్తులకి కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచింది. ఇక్కడి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని, 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం . అందుకే ఇక్కడ కొలవై ఉన్న ఆంజనేయస్వామిని భక్తులు ప్రేమతో అంజన్న అని పిలుస్తారు.

స్థలపురాణం

ఈ దేవాలయానికి సంబంధించి చాలా చరిత్రలు ఉన్నాయి. త్రేతాయుగంలో రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవనిని కోసం ఆంజనేయుడు బయలుదేరుతాడు. అప్పుడు సంజీవనిని తీసుకొని వెళ్తున్న క్రమంలో అందులోని కొంత భాగం ఈ మార్గములో విడిపోయిందని, ఆ భాగమునే కొండగట్టుగా పిలుస్తున్నారని చెబుతారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి మరో చరిత్ర కూడా ఉంది. కొడిమ్యాల అనే ప్రాంతంలో సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఉండగా అతని ఆవు తప్పిపోగా వెతకడం మొదలుపెట్టాడు. ఆ వెతుకులాటలో అలిసిపోవడంతో ఓ పెద్ద చింతచెట్టు కింద నిద్రపోయాడు. ఈ క్రమంలో అతనికి కలలో ఆంజనేయస్వామి కలలో కనిపించి నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. అంతలో సంజీవుడు నిద్రనుంచి లేచి చూసేసరికి తన ఆవు కనిపించింది. ఆ తర్వాత స్వామి చెప్పిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ స్వామి వారు శంఖు చక్ర గదాలంకరణతో విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా కనిపించాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది.

మరిన్ని విషయాలు

♦ ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాల( నృసింహస్వామి,ఆంజనేయస్వామి) తో కనిపించడం విశేషం. శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

♦ ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడింది.

♦ ఇక్కడికి ప్రతి మంగళ, శని వారాలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

♦ ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి మొదలగు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

♦ హనుమంతుని దీక్షను తీసుకున్నవారు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు.

♦ ఉగాది పండగ రోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది.

♦ పెద్ద హనుమాన్ జయంతి, చిన్న హనుమాన్ జయంతి వేడుకలని ఘనంగా నిర్వహిస్తారు.

♦ శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.

Related posts

ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే

Hindu TV

దారిద్ర్యాన్ని నివారించే మయూఖాదిత్యుడు

Hindu TV

నరసింహస్వామి ఆరాధనా ఫలితం!

Hindu TV

లక్ష్మీదేవి నివాస స్థానాలు ఇవే

Hindu TV

సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు

Hindu TV

కాశీలో వృద్ధాదిత్యుడు

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు