March 15, 2021
  • Home
  • సంపాదకీయం
  • హిందూ ఆలయాలు, మఠాల స్థాపనల్లో సమాజ అభ్యున్నతి , సామాజిక కోణం దాగి ఉన్నదా లేదా?
సంపాదకీయం

హిందూ ఆలయాలు, మఠాల స్థాపనల్లో సమాజ అభ్యున్నతి , సామాజిక కోణం దాగి ఉన్నదా లేదా?

హైందవ ధర్మాన్ని, భారతీయ ప్రజలను పరిచయం చేయాలంటే వారి జీవన విధానంలో భాగమైన దేవాలయాలు, మఠాలు ప్రస్థావనకు వస్తాయి. హిందూధర్మం లేదా సనాతనధర్మం అనాధిగా విశ్వవ్యాప్తంగా ఒక ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది.  సనాతనధర్మం లోని అంశాలు ఎంతటి మహోన్నత ఆదర్శాలను కలిగి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్థుత కరోనా సంక్షోభంలో సనాతనధర్మం అందించిన సూత్రాలు ఎంత ఆచరణీయాత్మకమైనవో ప్రస్పుటంగా తెలియవచ్చుచున్నది. దానిని నిరుపణ చేయడానికి ఎలాంటి రుజువులు అవసరం లేదు. ప్రతి అంశం మన కనుల ముందు కదలాడుతున్నదే!

ఇక నిన్నటి అంశంలో ప్రస్థావించినట్లు…..

హిందూ ఆలయాలు, మఠాల స్థాపనల్లో సమాజ అభ్యున్నతి , సామాజిక కోణం దాగి ఉన్నదా లేదా?

ఈ అంశానికి వస్తే మొదటగా వైధ్యం గురించి చర్చించుకుంటే సనాతన ధర్మంలో  నారాయణుడి(భగవంతుడి) స్థానం ఎంత గొప్పదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “హైందవంలో భగవంతుడే అన్నింటికన్న ఉన్నతుడు” కావున భగవంతుడిని మించిన స్థానం ఏదియూ లేదు! ఐతే మన పూర్వీకులు మాత్రం  భగవంతుడితో సమమైన స్థానం మాత్రం రెండు వ్యవస్థలకు మాత్రం ఇచ్చి ఉన్నారు. వారే వైధ్యులు, ఆచార్యులు  … అందుకే సనాతన ధర్మ గ్రంధాలు “ వైధ్యో నారాయణో హరి” అని, “ఆచార్యదేవో భవ” అని  ప్రస్థుతించి ఉన్నాయి. అనగా వైధ్యుడు, అచార్యుడు సాక్షత్ నారాయణుడే అని అర్థం. అంటె ఇక్కడ సనాతన ధర్మం వారిపట్ల సమాజములో ఎంతటి మహోన్నతమైన గుర్తింపు అందించిందో అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ సంస్కృతి, సాంప్రదాయం అవతరించక మునుపు అవతరించిన సనాతన ధర్మం ఎంతటి ముందు చూపుతో సమాజానికి దిశానిర్ధేశనం చేసిందో,  ప్రపంచ సంస్కృతులన్నింటికి ఎంతటి దశా – దిశ చూపించిందో ఇలాంటి అనేక విషయాల పట్ల మనం అవగాహాన చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ఇకపోతే….

దేవాలయాలు ఆశ్రమాలు లేదా మఠాలలో అయా సంస్థలు లేదా యాజమాన్యాలు ఎంతవరకు వైధ్యం పై ఆలోచిస్తున్నాయి ?

ఇది నిజంగా  ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ! పాపం హిందూ ఆలయాలు, ఆశ్రమాలను ఆసుపత్రులుగా, విశ్వవిద్యాలయాలుగా మార్చాలంటూ  సనాతన ధర్మం పై విషం కక్కిన కుహానా లౌకికవాధ మేధావులు యావత్ హిందూ సమాజానికి మాత్రం ఒక మేలు చేసారనే చెప్పాలి.. ఎందుకంటే మనలో అలోచించే అవసరాన్ని వారు సూచించారు. యావత్ సమాజానికి మత, ప్రాంత, వర్ణ, వర్గ బేధాలు లేకుండా హిందుత్వ నిష్ట కలిగిన సంస్థలు చేస్తున్న సేవలను ఒకసారి ప్రపంచ పటంపై గుర్తించుకునే అవకాశం మనకు కలిగింది.

మెదటగా అచార్య వర్గం లేదా విద్య వ్యవస్థ :

ఇక్కడ విద్య వ్యవస్థ అనగానే నేడు మనం చూస్తోన్న కరీదైన చదువులు కాదు ! సమాజ క్షేమాన్ని ఆశించి నాటి నుండి నేటి వరకు అనగా మన ఋషి పరంపర మెదలు నేటి సరస్వతి శిశు మందిరాల వరకు… అలనాటి గురుకులాల నుండి నేటి వేద పాఠశాలల వరకు ఆయా క్షేత్రాలలో వారి వారి వసతులకు తగినట్లుగా వారు నిర్వహిస్తున్న పాఠశాలలను, విశ్వవిద్యాలయాలను ఇక్కడ మనం నిశితంగా పరిశీలన చేయాలి.  నాడు అఖండ భారతావని రక్షణకై అనేక మంది ఋషులు, మునులు  శాంతము (Peacefulness), ఆత్మ నిగ్రహం (self-control), క్రమశిక్షణ (austere/disciplined), స్వచ్ఛత (purity), ఓర్పు (tolerance), నిజాయితీ (honesty), జ్ఞానము (knowledge), బ్రహ్మ జ్ఞానము (wisdom), ఆధ్యాత్మికత (religiousness) అనే ఈ లక్షణాలతో కూడిన విద్యను తమ ఋష్యశ్రమ వేదికగా శిశ్యులకు అందించెడివారు. అలా కొన్ని యుగాలుగా అలనాటి విద్యవ్యవస్థ సాంప్రదాయ సిద్ధముగా ఆయా అశ్రమాలలో పరంపరగా నిర్వహించబడినది. దానినే మనం “ గురుకులం”గా చెప్పుకోవచ్చు.

గురుకుల విద్యా విధానం :

ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే..  గురువు ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం.

అసలు గురుకులం అనగా ఏమిటి ?

ఋషి సంప్రదాయాన్ని గురుకులం అని అంటారు. గురుకులాన్ని గురుపీఠం అని కూడా అంటారు. విద్యాపీఠం అని కూడా అనవచ్చు. గురుకులంలోని విద్యార్థులకు  విద్యాభ్యాసానికి సుల్కముండదు. (పీజు) గురుకు చేసే సేవ, గురుభక్తినే శుల్కంగా భావించబడుతుంది. ఈ గురుకులాలు  ఒకప్పుడు మహారాజుల ఆశ్రయంతో, వారి రక్షణతో నడుస్తుండేవి. జనావాసాలకు దూరంగా…. నదీ తీరాలలో ప్రశాంత వాతా వరణంలోగురుకులాలుండేవి. అందులో చేరిన విద్యార్థులు ఎంతటివారైనా, మహారాజ కుమారులైనా ఆశ్రమ పద్ధతులకు కట్టుబడి చదువుకొనవలసిందే. అయితే కొందరు బ్రహ్మ చారులు సమీప గ్రామాలలోని శ్రీ మంతుల ఇండ్లలో బిక్షను స్వీకరించి గురుకులానికి సహాయ పడుతూ వుండేవారు. బిక్షాటన చేయడము ఆనాటి గురుకుల విద్యార్థులకు చిన్నతనముగా వుండేది కాదు. (బ్రాహ్మణ పిల్లలకు చిన్నతనంలోనే ఉపనయము చేయటములోని మర్మమిదే. ఉపనయము కాకుండా బిక్షను స్వీకరించ కూడదు. ఉపయనము కానివారికి దానం చేయకూడదు). ఇది హైందవ ధర్మం. ఇక ఆధునిక విద్యా విధానంలో విద్యా బోధనకు సొమ్ములు తీసుకుంటున్నట్లుగా గురువులు విద్యార్థుల నుంచి ఎటువంటీ జీతమూ ఆశించెడివారుకాదు. ఎందుకంటే విద్య, జ్ఞానము మొదలగునవి వినియోగ వస్తువులు కావు అనేది మన పూర్వీకుల గొప్ప తాత్విక చింతనకు ఉదహరణ. విద్యను ఆర్జించదలచిన వారిని గురువు వ్యక్తిగతంగా పరీక్షించి వాళ్ళు విద్యార్థిగా జ్ఞాన సముపార్జనకు సరియైన వారో కాదో నిర్ణయించాలి. అంటే విద్య అనేది ఒక హక్కులా కాక ప్రతిభావంతులకు ఒక గౌరవంగా భావించారు నాటి భారతీయులు. ఒక విద్యార్థి తన విద్య పూర్తయ్యేవరకు (సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాల వరకు) సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించి. గురువు గారి వద్దే ఉంటూ విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా తన విద్యను పూర్తి చేస్తాడు. ఈ విద్యా విధానంలో బోధించే అన్ని పాఠాలు వైదిక సాహిత్యం నుంచే అయి ఉండాలి. ఎందుకంటే వేదాలలో అన్ని కళలూ, సైన్సుకు సంబంధించిన సమాచారం ఉంది. అది భౌతిక మార్గంలో కావచ్చు లేదా ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాఠ్యాంశాలలో భగవత్తత్వం అంతర్లీనంగా గోచరిస్తుంటుంది. అలా విద్యార్థులకు చిన్ననాటి నుండే జ్ఞాన సముపార్జనకు సుగమమైన మార్గాన్ని తమ అశ్రమ వెధికలుగా భారతీయ సనాతన ధర్మంలో ఋషులు, మునులుగా అభివర్ణింపబడిన అనేక మంది ఆనాడే సంపూర్ణ మానవ వికాసానికి / సమాజ క్షేమం కోసం గురుకుల వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసినారు. ఇది విశ్వానికి భారతీయ వైధిక వ్యవస్థ అందించిన మహోన్నత సాంప్రదాయం దీనిని అనుసరించే ప్రపంచ విద్య విధానం పలు మార్పులు చేర్పులతో ఆరాంభమైంది అనుటలో ఎలాంటి సందేహము లేదు. నాటి నుండి నేటి వరకు వైధిక పరంపరను కొనసాగిస్తూనే హిందూ దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, హిందుత్వ సంస్థల ఆధ్వర్యములో జ్ఞాన సముపార్జనకై పాఠశాలల నిర్వాహణ జరుగుచున్నది. ఈ క్రమం లోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక విశ్వవిద్యాలయాలకు భారతదేశం జన్మనిచ్చింది. ఈ విధమైన  విద్యభోధన వలన దయ, క్రమశిక్షణ, పరిశుభ్రత, సత్యశీలత మొదలగు లక్షణాలు అలవడతాయి. సామాజిక బాధ్యత అలవడుతుంది. ఈ విధానంలో విద్యను అభ్యసించిన వ్యక్తులు లౌకిక జీవన విధానానికీ, ఆధ్యాత్మిక జీవన విధానాల్నీ వేరు చేసి చూడలేదు. జీవితాన్నే పాఠంగా, నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవరుచుకోవడమే దీనియొక్క ముఖ్యోద్దేశం. అలాంటి ముఖ్య ఉద్ధేశ్యముగా నేటికి మనకు అనేక ఆశ్రమ పాఠశాలలు, వైధిక పాఠశాలలు, అఖాడాలు, వివిధ ఆశ్రమాల నిర్వాహణలో నడపబడుతున్న విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమసమాజ నిర్మాణంలో తమ భాగస్వామ్యాన్ని ఒక నిర్ధిష్ట పద్దతిలో కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రస్థుతం విదేశి విద్యా విధనం మోజులో అనేక కాన్వెంట్ స్కూళ్ళు, సకల హంగులతో మురిపించే మాడల్ స్కూళ్ళు అనేకం వచ్చినప్పటికి దేశ సేవ కై అనేక మంది విజ్ఞాన వంతులను తయారు చేస్తూ వైధిక ధర్మ స్పూర్తితో కుల,మత భేధాలు మరిచి ఈ పోటి ప్రపంచములో సైతం అనేక వ్యయప్రయాసలను ఓర్చి సరైన విద్యను అందించే శ్రీ సరస్వతి శిశు మందిరాలు సైతం ధార్మిక, వైధిక సాంప్రదాయాన్ని అనుసరించి వచ్చినవే !

అయ్యా !  కుహానా లౌకికవాద మేధావులారా (స్వయం ప్రకటిత) మీరు విదేశీ సంస్కృతి మోజులో , పరాయి మతాలకు అమ్ముడుపోయి >> తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా మీరు చెస్తున్న ఆరోపణల వెనుక అసలు వాస్తవాలు ఎంత? సమాజ సేవకు హైందవం ఎంతటి మహోన్నత స్థానం కల్పించి ఉన్నదో ఓ సారి అలోచించమని చెబుతూ .. ఈ రోజు గొర్రెల మందలో చేరిన సింహం వలే మీరు ప్రవర్థిస్తున్న, పరదేశీయులకు బానీసలుగా మారి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న మీ గతం ఓ సారి పరిశీలన చేసుకొండి .. మీ ఉనికి ఎక్కడిదో మీకు అర్థమవుతుంది !

 

  • వైధ్యరంగంపై కుహానా లౌకికవాద మేధావుల అర్థం లేని కామెంట్లకు అర్థవంతమైన సమాధానాలు తదుపరి టపాలో..

జై హింద్ ! వందే భారతమాతరమ్ !!

 

మీ ..

భరత్ కుమార్ శర్మ సంకేపల్లి

ఫోన్ : 9000790904.

Related posts

జిజియా పన్నుకు ఏమాత్రం తీసిపోని విధంగా” హలాల్ సర్టిఫికేషన్ “

Hindu TV

హిందూ, హిందుత్వం, హిందుస్తాన్

Hindu TV

గురు పౌర్ణమి విషిష్టత ! గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి?

Hindu TV

ద్వార లక్ష్మీ పూజా ఫలితం

Hindu TV

1 వ్యాఖ్య

ImmomsInsepay September 16, 2020 at 6:53 am

slots games free casino blackjack casino real money http://onlinecasinouse.com/#

ప్రత్యుత్తరం

అభిప్రాయము ఇవ్వగలరు