February 13, 2021
పండుగ ప్రత్యేకం

వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే

గరుడ దండకం’ ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి గరుడ దండకాన్ని వేదాంత దేశికులవారు రచించారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా చెప్పబడే ‘తిరువహీంద్ర పురం’ అనే క్షేత్రంలో ఆయన గరుడ దండకాన్ని రచించారు. ఈ క్షేత్రం ‘కడలూరు’కి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు ‘తైవ నాయక’ .. అమ్మవారు ‘వైకుంఠనాయకి’ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

గరుడ .. పెన్నా .. సేవై అనే ఇక్కడి మూడు తీర్థాలు పరమ పవిత్రమైనవిగా చెబుతారు. ఈ కొండపైనే వేదాంత దేశికులవారు గరుత్మంతుడిని .. హయగ్రీవుడని ఆరాధించారు. ఇక్కడే ఆయన వారి సాక్షాత్కారాన్ని పొందారు. ఆ సమయంలోనే ఆయన ‘గరుడ దండకం’ .. ‘హయగ్రీవ స్తోత్రం’ రచించారు. ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు అత్యంత ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని, పఠించినవారిని ఒక కవచంలా రక్షిస్తూ ఉండటం విశేషం.

Related posts

నాగేంద్రుడి అనుగ్రహం ఇలా దక్కుతుంది !

Hindu TV

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

Hindu TV

సుబ్రహ్మణ్య షష్ఠి

Hindu TV

అదే ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత !

Hindu TV

వైశాఖ పౌర్ణమి రోజున ఏంచేస్తే పుణ్యం ?

Hindu TV

నాగపంచమిన నువ్వుల నూనెతో దీపారాధన

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు