August 30, 2020
పండుగ ప్రత్యేకం

అక్షయ తృతీయ విశిష్టత

అక్షయ తృతీయ’ అనగానే అందరూ బంగారం కొనడానికి బయలుదేరుతుంటారు. బంగారానికీ … అక్షయ తృతీయకి గల సంబంధమేమిటో తెలియకపోయినా, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తుంటారు. ‘వైశాఖ శుద్ధ తదియ’ రోజునే అక్షయ తృతీయ అని అంటారు. అక్షయమైన సంపదలను … పుణ్య ఫలాలను ప్రసాదిస్తుందనే కారణంగానే ఈ పర్వదినాన్ని అక్షయ తృతీయగా పిలుస్తుంటారు.

నగదు రూపంలో గానీ … నగల రూపంలోగాని ఈ రోజున ఏవైతే ఇంటికి వస్తాయో, అవి అక్షయమై స్థిరంగా ఉండిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈ రోజున బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. బంగారం .. లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడింది గనుక, ఈ రోజున బంగారం రూపంలో వచ్చిన లక్ష్మీదేవి, ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుందని విశ్వసిస్తుంటారు.

అంతే కాకుండా ఈ మాసం వివాహాలకు ప్రత్యేకం కనుక, అందుకు అవసరమైన బంగారాన్ని ఈ రోజున కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు. సాధారణంగా ఏవైనా శుభకార్యాలు ప్రారభించాలనుకున్నప్పుడు, మంచిరోజు కోసం … మంచి సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి అక్షయ తృతీయ కన్నా మంచిరోజు లేదని చెప్పబడుతోంది. ఈ రోజున పూజా మందిరంలో గల లక్ష్మీదేవిని కొత్తగా కొన్న బంగారు ఆభరణాలతో అలంకరించి పూజించడాన్ని చాలామంది ఒక ఆనవాయతీగా పాటిస్తూ వస్తుంటారు.

కృతయుగం ఆరంభమైన రోజుగా చెప్పబడుతోన్న ఈ రోజున చేసే పితృకార్యాలు … దైవ కార్యాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అత్యంత శుభప్రదమైనదిగా చెప్పబడుతోన్న ఈ రోజున గొడుగు … పాదరక్షలు … నూతన వస్త్రాలు … శనగలు … గోధుమలు … పెరుగన్నం దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అర్హులైన వారికి ఈ విధంగా దానాలు చేయడం వలన దైవానుగ్రహం లభిస్తుందనీ, సిరిసంపదలు రెట్టింపు అవుతాయని స్పష్టం చేస్తోంది.

Related posts

నాగేంద్రుడి అనుగ్రహం ఇలా దక్కుతుంది !

Hindu TV

శ్రావణమాసంలో ఒంటిపూట భోజనం

Hindu TV

వైశాఖ పౌర్ణమి రోజున ఏంచేస్తే పుణ్యం ?

Hindu TV

గురు పౌర్ణమి విషిష్టత ! గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి?

Hindu TV

వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే

Hindu TV

శ్రీరామనవమి పూజా విశేషం

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు