March 15, 2021
ఆలయాలు

జ్వాలాముఖి అమ్మవారు

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ తల్లిని పూజించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి శక్తి పీఠాలను దర్శించే భక్తుల సంఖ్య విశేషంగా ఉంటుంది. అలా భక్తులచే విశేషంగా పూజలు అందుకునే శక్తి పీఠంగా ‘జ్వాలాముఖి’ దర్శనమిస్తుంది.

సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు పడిన ప్రదేశాలు .. శక్తి పీఠాలుగా వెలుగొందుతూ వున్న సంగతి తెలిసిందే. అలా ఈ ప్రదేశంలో అమ్మవారి ‘నాలుక’ పడిందని స్థలపురాణం చెబుతోంది. 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్ లో అలరారుతోంది.

ఇక్కడి అమ్మవారి సన్నిధిలో తొమ్మిది జ్యోతులు (జ్వాలలు) వెలుగొంతూ ఉంటాయి. ఇవి ఎవరూ వెలిగించినవి కావు .. వేల సంవత్సరాలుగా అవి అలా వెలుగుతూనే ఉన్నాయి. ఈ జ్వాలలు పెరగడం గానీ .. తగ్గడంగాని జరగదు. వీటి వెనుక రహస్యం తెలుసుకోవడానికి కొంతమంది ప్రయత్నించి విఫలమయ్యారు. అమ్మవారే జ్వాలా రూపంలో ఇక్కడ కొలువై ఉందని భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారికి పాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఆరాధిస్తుంటారు.

Related posts

హనుమ అనుగ్రహం ఇలా లభిస్తుంది

Hindu TV

కుష్ఠు వ్యాధిని తొలగించిన సోమేశ్వరుడు

Hindu TV

కొండపై వెలసిన లక్ష్మీ నరసింహుడు

Hindu TV

స్వప్నంలో హెచ్చరించిన చెన్నకేశవస్వామి

Hindu TV

కన్నీళ్లు పెట్టుకున్న సీతమ్మవారు

Hindu TV

వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు