February 13, 2021
వ్యాసాలు

ఈ వీధిపోట్లు మంచివే !

ఇంటికి వీధిపోట్లు అనే మాటను తరుచుగా వింటాం. నిజానికి మన పెద్దలు పెట్టిన నియమాలనే వాస్తు శాస్త్రంగా పరిగణిస్తాం. వీధిపోటు అంటే ఏమిటీ? ఏయే వీధిపోట్లు మంచి చేస్తాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం…

ఇంటికి ఎదురుగా నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుండి ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోటు వల్ల సదరు గృహస్తులకు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వీధి పోటు వల్ల కలిగే ఫలితాలు కింది విధంగా ఉంటాయి.గృహానికి తూర్పు, ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి వల్ల వీధిపోటు కలుగుతుంది. ఈ రకమైన పోటు వల్ల సదరు గృహంలో నివశించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు.

నివశించే ఇంటికి ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి వున్నప్పుడు కలిగే వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో పాటు కోర్కెలు తీరి ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధన ఆదాయం బాగుగా ఉంటుంది.ఇంటికి ఉత్తర – వాయువ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి పోటు కలుగుతుంది. ఈ తరహా వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరివరకు వచ్చి తప్పిపోవడం, ఇంకా అనేక సమస్యలకు, చికాకులకు కలుగుతాయి.

ఇంటికి పశ్చిమ – వాయువ్యంలో వీధి వున్నప్పుడు వీధిపోటు కలుగుతుంది. దీని వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది.ఇంటికి పశ్చిమ – నైరుతి భాగంలో వున్న వీధి వల్ల వీధిపోటు వస్తుంది. దీనివల్ల సదరు ఇంట్లోని వారికి శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట, నష్టాలు తప్పవు.

ఇంటికి దక్షిణ – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక పూర్తి ఇబ్బందులకు గురవుతారు.
ఇంటికి దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల కలిగే పోటుతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పైన పేర్కొన్నవాటితోపాటు ఇంటికి తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం కలిగే పోటు వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి. ఈ విధంగా గృహానికి కలిగే వీధిపోట్ల వల్ల కొన్ని మంచి ఫలితాలు, మరి కొన్నిసార్లు చెడు ఫలితాలు కలిగే అవకాశముందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

నిజానికి శాస్త్రీయంగా ఆలోచిస్తే వీధిపోటు అంటే ఆ ఇంటికి ఎదురుగా రోడ్డు రావడం.. ప్రస్తుత కాలంలో మనం అనేక సందర్భాలలో చూస్తున్నాం. ఆయా వాహనాలు బ్రేకులు పడక ఎదురుగా ఉన్న ప్రదేశాలు, ఇండ్లులలోకి వెళ్లడం అక్కడ ప్రమాదాలు జరగడం. కాబట్టి రోడ్డుకు ఎదురుగా ఇండ్లు ఉంటే ప్రమాదాలని మనవారు వాటిని విశ్లేషించి, ఆయా ప్రమాద ఘటనల గణాంకాల ఆధారంగా ఏర్పాటుచేసినవే వీధిపోట్లు. దీనిలో మంచిని గ్రహించి పాటిస్తే ప్రయోజనాలే తప్ప ప్రమాదాలు లేవు.

Related posts

ఆయన శాపమే అందుకు కారణం !

Hindu TV

వివాహం కాని అమ్మాయిలు ఇలా చేస్తే వెంటనే పెళ్లి ఖాయం!

Hindu TV

దైవానికి ఇలా నమస్కరించాలి

Hindu TV

గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ

Hindu TV

పరశురామావతారం

Hindu TV

పుణ్యభూమి కాశీలోని వింతలు విశేషాలు

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు