March 15, 2021
  • Home
  • ఆలయాలు
  • వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే
ఆలయాలు

వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే

‘గరుడ దండకం’ ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి గరుడ దండకాన్ని వేదాంత దేశికులవారు రచించారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా చెప్పబడే ‘తిరువహీంద్ర పురం’ అనే క్షేత్రంలో ఆయన గరుడ దండకాన్ని రచించారు. ఈ క్షేత్రం ‘కడలూరు’కి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు ‘తైవ నాయక’ .. అమ్మవారు ‘వైకుంఠనాయకి’ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

గరుడ .. పెన్నా .. సేవై అనే ఇక్కడి మూడు తీర్థాలు పరమ పవిత్రమైనవిగా చెబుతారు. ఈ కొండపైనే వేదాంత దేశికులవారు గరుత్మంతుడిని .. హయగ్రీవుడని ఆరాధించారు. ఇక్కడే ఆయన వారి సాక్షాత్కారాన్ని పొందారు. ఆ సమయంలోనే ఆయన ‘గరుడ దండకం’ .. ‘హయగ్రీవ స్తోత్రం’ రచించారు. ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు అత్యంత ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని, పఠించినవారిని ఒక కవచంలా రక్షిస్తూ ఉండటం విశేషం.

Related posts

పెరుగుతున్న శంభులింగేశ్వరుడు

Hindu TV

ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే

Hindu TV

రామలక్ష్మణుల కారణంగా ఏర్పడిన జంట క్షేత్రాలు

Hindu TV

వ్యాధులను నివారించు వేంకటేశ్వరుడు

Hindu TV

పూరి క్షేత్రం ప్రత్యేకతలు

Hindu TV

కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు