March 15, 2021
ఆలయాలు

లక్ష్మీదేవి నివాస స్థానాలు ఇవే

జీవితంలో ఆర్ధికపరమైన సమస్యలు .. మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడచుకోవలసి ఉంటుంది. పాలు .. పూలు .. పసుపు .. కుంకుమ .. దీపం .. గోవు .. ధనం .. ధాన్యం ..  ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. అందువలన వాటి విషయంలో  ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక  గ్రంథాలు చెబుతున్నాయి. వాటి విషయంలో ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో వ్యవహరించవలసి ఉంటుంది.

అలాగే బాగా పొద్దుపోయేవరకూ నిద్రించేవారి ఇళ్లలోను .. సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృథా చేసేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో వుండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత .. ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

Related posts

అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవులు

Hindu TV

శ్రీవారి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ

Hindu TV

అమ్మపేట ఆలయం ప్రత్యేకత

Hindu TV

సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు

Hindu TV

దేవాలయంలో సాష్టాంగ నమస్కారం

Hindu TV

చెన్నకేశవస్వామి మహిమ అలాంటిది

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు